17 May, 2026 | 5:26 PM

డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు

17-05-2026 04:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో విద్య వారోత్సవాల సందర్భంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంస్కృతిక విభాగం అధిపతి డాక్టర్ రంజిత్ కుమార్,  డాక్టర్ రాథోడ్ మురాహరి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. నృత్య ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సన్మానం చేశారు