మున్సిపల్‌లో పైసల పంచాయతీ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో(Nirmal Municipality) మంజూరైన 15 కోట్ల పనుల పంచాయతీ కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రేపుతుంది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మూడు నెలల క్రితం 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభిపోవడంతో అటెండర్ ను ఇటీవలే అధికారులకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య అధ్యక్షతన రద్దు చేశారు.
తిరిగి ఆ నిధులతో పనులు చేపట్టేందుకు పట్టణంలో 42 వార్డులో నిధుల కేటాయింపులు కాంగ్రెస్, బిజెపి కౌన్సిలర్ల(BJP Councilors) మధ్య వివాదం నెలకొంటుంది. పాత టెండర్లను ఖరారు చేయాలని పాత కేటాయింపులే కౌన్సిలర్లకు కేటాయించాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మున్సిపల్ సమావేశంలో బుధవారం మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా బిజెపి వాడు కౌన్సిలర్ల పై వివక్షత ప్రదర్శించి నిధుల ఎక్కువగా కాంగ్రెస్ ఎంఐఎం వార్డులకి కేటాయించాలని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. అధికారుల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు






