16 June, 2026 | 8:31 PM

నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం

16-06-2026 07:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్నిచాటుకున్నారు.  బాల్యమిత్రుల ట్రస్ట్ 1978-81 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండల కేంద్రంలోని పూసాల కు చెందిన నిరుపేద యువతి గంగోత్రి వివాహం ఈనెల 20న జరుగుతుండడంతో గంగోత్రి తండ్రి గతంలో మృతి చెందాడని,  యువతి వివాహం ఉండడంతో బాల్యమిత్రులు 50 వేల రూపాయలను మంగళవారం  పెళ్లికూతురు తల్లి మెరుగు రజితకు అందించారు.