16 June, 2026 | 9:39 PM

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

16-06-2026 08:29 PM

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 49వ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులతో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధితోపాటు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని  ప్రతి ఒక్కరూ  ఆయురారోగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని  వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.