16 June, 2026 | 8:31 PM

ఫసల్ బీమా అమలు కాక దిగాలు పడుతున్న రైతన్న.

16-06-2026 07:34 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగేపు బో ర్రన్న విమర్శించారు మంగళవారం ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పంటను పండిస్తున్న రైతుకు బీమా అమలు చేయకపోవడంతో పంట ఇంటికి వచ్చేవరకు ఆందోళన మధ్యనే సాగు చేస్తున్నారన్నారు గత ఏడాది భారీ వర్షాల వల్ల 23 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన నష్టానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు ఫసల్ బీమా పథకం అమలై ఉంటే ఎకరానికి 50వేల రూపాయల పరిహారం అందేదన్నారు

ఫసల్ బీమా పథకం అమలు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలోకి వెళ్లిపోయారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని హామీలు ఇచ్చి పార్టీ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పసల్ బీమా యోజన అమలు చేయలేదన్నారు గత వారం నుండి వెళ్లి నేను ప్రభావం వల్ల ఎండ తీవ్రత అధికంగా ఉండడం ఫలితంగా రైతులు విత్తనాలు వేసే పరిస్థితిలో లేకుండా పోయారన్నారు ఏడది సాగు చేయాలంటేనే రైతులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా పంటల భీమా పథకం అమలు చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు సమావేశంలో ఏ రాజశేఖర్ రెడ్డి రాజబాబు భూమారెడ్డి గోపిచంద్ తదితరులు ఉన్నారు