ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడండి
16-06-2026 08:09 PM
బోథ్,(విజయక్రాంతి): ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా సిద్ధం చేయాలని బోత్ తహసిల్దార్ సుభాష్ చంద్ర పేర్కొన్నారు మంగళవారం సోనాల బోత్ మండలాలకు సంబంధించిన బిఎల్ఓ లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్వోలు చేయాల్సిన విధుల గురించి వివరించారు. చిన్న పొరపాటు చేస్తే భవిష్యత్తులో ఓటరు తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందన్నారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దని పేర్కొన్నారు. సమావేశంలో సోనాల తహసిల్దార్ మల్లేష్ వివిధ రాజకీయ పక్షాల నాయకులతోపాటు బిఎల్వోలు పాల్గొన్నారు.






