16 June, 2026 | 9:22 PM

యూరియా కోసం చెప్పుల క్యూ..

16-06-2026 08:12 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండా లో గల గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులను క్యూ లో పెట్టీ ఎదురుచూశారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి గాండ్ల సాయిలు ను విజయ క్రాంతి సంప్రదించగా నేరల్ తండా గోదాముకు 888 బస్తాల యూరియా బస్తాలు వచ్చాయని యూరియా యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు బుకింగ్ ప్రకారం యూరియా బస్తాలు అందచేస్తామని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రైతులు ఒకేసారి వచ్చి అవగాహన లేక తమకు యూరియా దొరుకుతుందో లేదో అని అలా చెప్పులు క్యూ లో పెట్టారని అన్నారు. యూరియా యాప్ లో బుక్ చేసుకున్న రైతుకు వారి బస్తాలు వారికే అందచేస్తామని ఎవరు ఆందోళన చెంది ఇలా క్యూ కట్టాల్సిన పని లేదని అన్నారు.