అంకుషాపూర్‌లో మహిళ మృతి
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ముద్దం భాగ్యవ్వ (వయస్సు వివరాలు తెలియరాలేదు) తన ఇంటి షెడ్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం (16-06-2026) చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె పార్కపల్లి జయ (చిన్నకోడూరు గ్రామం, సిద్దిపేట జిల్లా) ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం, ముద్దం భాగ్యవ్వ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మృతురాలి మరణంపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






