12 April, 2026 | 5:01 PM

మాట నిలబెట్టుకున్న కందాళ

12-04-2026 03:17 PM

ఆలయ నిర్మాణానికి రూ.50 వేల ఆర్థిక సాయం

కూసుమంచి,(విజయక్రాంతి): పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గన్యతండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్, మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక తోడ్పాటును అందించారు. గతంలో తండా పర్యటనకు వచ్చిన సమయంలో ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు, రూ.50,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, డిసిసిబి మాజీ డైరెక్టర ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదుబాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్,కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్,బాలాజీ ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు