30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గాంధీ పేరును కొనసాగించే వరకు పోరాటం

13-02-2026 12:00 AM

మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు

ముషీరాబాద్, ఫిబ్రవరి12  (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యధావిధిగా మహాత్మా గాంధీ పేరు ను కొనసాగించే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఈ మేరకు గురువారం అంబర్ పేట నియోజకవర్గం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి నిరసిస్తూ మాజీ పీసిసి కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో  సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్ర ప్రభు త్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు మాజీ పీసిసి కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వా మి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.