13-02-2026 12:00:00 AM
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 12: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం తగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల రెవెన్యూ పరిధిలోని గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం మండల కేంద్రంలోని శివ గార్డెన్ నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నారనే సమాచారాన్ని తెలుసుకుని స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్ని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు.
ఉచిత విద్యుత్ పథకం, ఇందిరమ్మ ఇండ్లు, నీటి సమస్యల గురించి తెలిపారు. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రజాపాలనలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంపూర్తి వ్యక్తం చేశారు. అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ 225 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.
నూతన సర్పంచ్‌లతో సమీక్ష
మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, పలు శాఖల సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలకు అభివృద్ధి కోసం సర్పంచ్‌లు అధికారులతో సమన్వయం చేసిన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ద్యంపై దృష్టి పెట్టాలన్నారు.
వచ్చేది వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలను తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశాలను జారీ చేశారు. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, బాటసింగారం సహకారం సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో యూ శ్రీవాణి, పలు గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.