ఎన్‌బీకే111 టైటిల్, డేట్ వస్తోందహో!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ (NBK111) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి బాలకృష్ణ పుట్టినరోజున ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ (Entry of an Era)పేరుతో మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో బాలా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్డేట్ రాబోతోంది. ఈ మూవీ టైటిల్‌ను, విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోమవారం వెల్లడించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్; సంగీతం: ఎస్ థమన్; డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా; యాక్షన్: రామ్‌లక్ష్మణ్, రవివర్మ, వెంకట్; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.






