29 March, 2026 | 3:41 AM

పశ్చిమాసియాలో అతిభీకరదాడులు

29-03-2026 01:59 AM
  1. 29వ రోజూ అమెరికాె ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం

గాజాలో ఇజ్రాయెల్ దాడిలో ఇద్దరు సోదరుల మృతి

అబుదాబిలోని ఖలీఫా ఎకనామిక్ జోన్స్ సమీపంలో క్షిపణి దాడి.. 

ఆరుగురు భారతీయులకు గాయాలు

డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ రాడార్ వ్యవస్థ 

ఒమన్‌లోని సలాలా పోర్టులో డ్రోన్ దాడి

సిరియాలో ఐదుగురు రైతులు మృతి.. మరో 8 మందికి గాయాలు

174 క్షిపణులను, 385 డ్రోన్లను కూల్చేసిన బహ్రెయిన్

ఇరాక్‌లోని మజ్నూన్ చమురు క్షేత్రంలో కూలిన డ్రోన్

సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడి

ఈ దాడిలో 12 మంది అమెరికా సైనికులకు గాయాలు

టెహ్రాన్/టైర్/బీరుట్/డమాస్కస్/రియాద్/మార్చి 28: పశ్చిమాసియాలో రోజురో జుకూ అతిభీకరదాడులు తీవ్రమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై శనివారానికి 29 రోజులైంది. గాజాలో ఇజ్రాయెల్ దాడిలో ఇద్దరు సోదరులు మృతి చెందారు. అబుదాబిలోని ఖలీ ఫా ఎకనామిక్ జోన్స్ సమీపంలో జరిగిన క్షిప ణి దాడిలో ఆరుగురు భారతీయులకు గాయాలయ్యాయి. డ్రోన్ దాడిలో కువైట్ అం తర్జాతీ య విమానాశ్రయంలో రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఒమన్‌లోని సలాలా పోర్టుపై డ్రోన్ దాడిలో కార్మికుడికి గాయమైంది.

సిరియా రైతులపై ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు మృతి చెంద గా, మరో ౮ మందికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 174 క్షిపణులను, 385 డ్రోన్లను బహ్రెయిన్ కూల్చేసింది. ఇరాక్‌లోని బస్రా ప్రావిన్స్‌లోని మజ్నూన్ చమురు క్షేత్రంలో ఓ డ్రోన్ కూలి పేలలేదు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయి.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇద్దరు సోదరులు మృతిచెందారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పాలస్తీనా కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. గాజాస్ట్రిప్ అంతటా ఇజ్రాయెల్ నియం త్రిత ప్రాంతాలను మిగిలిన ఎన్‌క్లే నుంచి వేరుచేసే ‘ఎల్లోలైన్’కు సమీపంలో ఈ దాడి జరిగిం ది. మశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ ప్రాంతంలో తరచూ దాడులు జరుగుతున్నాయి.

ఇరాన్ దాడుల వల్ల అబుదాబి పారిశ్రామిక కేంద్రం సమీపంలో మూ డో అగ్నిప్రమాదం జరిగింది. యూఏఈలోని అతిపెద్ద సమీకృత ఆర్థిక మండలాలు, పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటైన ఖలీఫా ఎకనామిక్ జోన్స్ అబుదాబి సమీపంలో మూడో అగ్నిప్రమాదం సంభవించినట్లు అబుదాబి మీడియా కార్యాలయం తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడం వల్ల పడిన శిథిలాల కారణంగా మూడుచోట్ల మంటలు చెలరేగాయని, ఇందు లో ఆరుగురు భారతీయులు గాయపడ్డారని వెల్లడించింది. మంటలను అదుపులోకి తెచ్చామని పేర్కొంది.

ఇరాన్ డ్రోన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది. ఈ దాడుల వల్ల విమానాశ్రయంలోని రాడార్ వ్యవస్థకు భారీనష్టం వాటిల్లిందని కువైట్ పౌర విమానయాన అధికారులు తెలిపారు. ఒమన్‌లోని సలాలా పోర్టులో డ్రోన్‌దాడిలో కార్మికుడికి గాయమైంది. ప్రభుత్వవార్తా సంస్థ ప్రకా రం.. ఒమన్‌లోని సలాలా పోర్టును లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్‌దాడిలో ఒక కార్మికుడు గాయపడ్డాడు.

ఈ దాడి వల్ల మౌలిక సదుపాయాలపై స్వల్ప ప్రభావం పడిందని, విస్తృత అంతరాయం కలిగినట్లు తక్షణ నివేదికలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. అమెరికా ఇరాన్ మధ్య ఒకప్పుడు మధ్యవ ర్తిగా ఉన్న ఒమన్, ఇప్పుడు ప్రాంతీయ ఉద్రిక్తతలలోకి లాగబడింది. ప్రాంతీయ వివాదాల్లో మస్కట్ చారిత్రాత్మకంగా తటస్థ వైఖరిని అవలంబిస్తూవస్తోంది. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల పరంపరను పూర్తి చేసిందని ఐడీఎఫ్ వెల్లడించింది.

ఈ దాడులు ఇరాన్ పాలన, మౌలిక సదుపాయాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని సైన్యం పేర్కొంది. మరోవైపు సిరియాపై ఇజ్రాయెల్‌దాడిలో ఐదుగురు రైతులు మృతిచెందారు. అల్-హన్ని యేలో సిరియారైతులపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతుల సంఖ్య కనీసం ఐదుకు పెరిగిందని లెబనాన్ జాతీయవార్తా సంస్థ తెలిపిం ది. మరో ౮ మంది గాయపడగా, వారిని టైర్‌లోని ఆసుపత్రులకు తరలించారు.

ఇరాక్‌లోని మజ్నూన్ చమురు క్షేత్రంలో డ్రోన్ కూలింది. కానీ ఎటువంటి ప్రాణనష్టంగానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. శనివారం ఉదయం బస్రా ప్రావిన్స్‌లోని మజ్నూన్ చమురు క్షేత్రంలో ఒక డ్రోన్ కూలిపోయిందని ఇరాక్ రక్షణ మంత్రి త్వ శాఖ తెలిపింది. ఆ డ్రోన్ పేలకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది. సౌదీ స్థావరంపై ఇరాన్ దాడిలో 12 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయి.

అమెరికా, సౌదీ అధికారులను ఉటంకిస్తూ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడిలో కనీసం 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో బాలిస్టిక్ క్షిపణి, అనేక డ్రోన్లను ఉపయోగించారని, అలాగే అమెరికా సైనిక ఇంధన సరఫరా విమానాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు మధ్య ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి జరగడంతో కనీసం ఒక వ్యక్తి మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడి యా తెలిపింది. ఇరాన్, హిజ్బుల్లా నుంచి కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో, శుక్రవారం నుంచి శనివారం రాత్రికి రాత్రే బీర్ షెవా, ఇజ్రాయెల్ ప్రధాన అణుపరిశోధనా కేంద్రం సమీప ప్రాంతాల్లో మూడోసారి దాడి సైరన్లు మోగాయి. టెహ్రాన్ అంతటా దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ప్రస్తుతం రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్ష సైనిక చర్య జరుగుతోంది. దక్షిణ టెహ్రాన్‌లో దాడి తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో ఉన్న వారిని, మృతదేమాలను సహాయక సిబ్బంది బయటకు తీస్తున్నారు. నగరంలోని దక్షిణ జిల్లాలో ఓ నివాస భవనంపై అమెరికా- క్షిపణి దాడి జరిగిన తర్వాత సహాయక బృందాలు స్పందించాయి.  మృ తుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పశ్చిమ ఇరాన్‌పై శుక్రవారం జరిగిన దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. పశ్చిమ ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రావిన్స్‌పై అమెరికా, ఇజ్రా యెల్ జరిపిన దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారని, వారిలో ఒకరు గర్భవతి అని ప్రభుత్వ మీడియా సంస్థ తస్నిమ్  తెలిపింది. డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారని భద్రతా అధికారి తెలిపారు.

ప్రాంతీయ శాంతి, భద్రతకు ప్రత్యక్ష ముప్పు

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహ్రెయిన్ 174 క్షిపణులను, 385 డ్రోన్లను కూల్చివేసింది. నెల రోజుల క్రితం ఇరాన్‌పై అమెరికా- యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న 174 ఇరాన్ క్షిపణులను, 385 డ్రోన్లను అడ్డుకుని, ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ సైన్యం తెలిపింది.

పౌర మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడాన్ని ‘అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఘోరంగా ఉల్లంఘిం చినట్లు అని, ప్రాంతీయ శాంతి, భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ విషయాన్ని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.