16 August, 2026 | 7:55 PM

పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడుకి సన్మానం..

16-08-2026 06:36 PM

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అందే గణేష్ ను ఆదివారం కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరి గాధ లక్ష్మీ నరసింహులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేని నరసయ్య, ప్రధాన కార్యదర్శి బొమ్మెర రాజయ్య, కోశాధికారి సబ్బని ధర్మపురి, డివిజన్ అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్, పద్మశాలి సంఘం జిల్లా ఎన్నికల కన్వీనర్, న్యాయవాది జగన్నాథం, కో కన్వీనర్, న్యాయవాది సిద్ధరాములు, కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు ఉన్నారు.