16 August, 2026 | 8:43 PM

వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు

16-08-2026 07:50 PM

మంథని,రామగిరి ఆగస్టు16 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో లద్నాపూర్ మాజీ సర్పంచ్ బొల్లేపల్లి స్వామిగౌడ్, లక్ష్మి దంపతుల కుమారుని వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై అఖిల్ మనీషా వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ముత్తారం మండలంలోని జిల్లాలపల్లి సర్పంచ్ గడ్డం రాజేష్ కుమారుని వివాహం ధర్మారం మండల కేంద్రంలో జరగగా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. మాజీ జెడ్పిటిసిలు చొప్పరు సదానందం నాగినేని జగన్మోహన్రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీతో పాటు మైదం వరప్రసాద్, సత్యనారాయణ గౌడ్, తాళ్లపల్లి నారాయణ గౌడ్, దుబాసి రంగన్న తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.