హక్కుల కోసం... మున్నూరుకాపులంతా ఏకం కావాలి
రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపు
జవహర్ నగర్ లో సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
జవహర్ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మున్నూరుకాపులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపునిచ్చారు. కులాల వారీగా జనగణన జరగనున్న నేపథ్యంలో మున్నూరుకాపులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ మేరకు జవహర్ నగర్ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన.. నూతన అధ్యక్షుడు కాశెట్టి మహేందర్ పటేల్ ప్రధాన కార్యదర్శి ఎలుగల మధుసూదన్ పటేల్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది మందితో మొదలైన సంఘం.. 200 మంది క్రియాశీల సభ్యులకు చేరడంపై ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు మామిండ్ల శ్రీనివాస్, పర్వతనేని సతీశ్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వాసాల వెంకటేశ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకుల సత్యనారాయణ, జవహర్ నగర్ సంఘం ఉపాధ్యక్షులు మంచికంటి శేఖర్ పటేల్, శ్రీకర్ పటేల్, సురేందర్ పటేల్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.






