16 August, 2026 | 8:56 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ

16-08-2026 06:33 PM

కామారెడ్డి, ఆగస్టు 16, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంకు చెందిన కంశెట్టి లింబాద్రి- సత్యవ్వల కుమారుడు సురేష్ వివాహానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్ హాజరయ్యారు. ఆదివారం రోజున దోమకొండలోని పెరిక సంఘం భవనంలో సురేష్ - సౌజన్యల వివాహము జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం వైస్ చైర్మన్ సుంచు రాములు పాల్గొన్నారు.