పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం
13-07-2026 09:27 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మెల్ల కుంట తండా గ్రామానికి చెందిన విశ్లవత్ నీల, కోర్ర నరేందర్లు గ్రామీణ డాక్ సేవక్ సేవలందించారు.ఢిల్లీలోని తపాలా శాఖలో పదోన్నతి పొందిన సందర్భంగా వారికి అభినందిస్తూ మెల్లకుంట తండావాసులు ఘనంగా సన్మానించారు.అలాగే తండాలోని పేద గిరిజన కుటుంబంలో అయినటువంటి వారు కష్టపడి చదివి వీరి లాగానే ఉద్యోగం సాధించి సమాజానికి మంచి పేరు రావాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో మెల్ల కుంట తండా గ్రామస్తులు పాల్గొన్నారు.






