హిల్స్ వ్యూ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సతీష్ ఏకగ్రీవ ఎన్నిక
ఘట్ కేసర్, జూలై 13 (విజయక్రాంతి) : పోచారం డివిజన్, ముత్వేల్లిగూడ పరిధిలోని హిల్స్ వ్యూ కాలనీ వెల్ఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎరుకల సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సోమవారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈమేరకు కమిటీ ఎన్నికలు జరిగినట్లు అందులో నూతన అధ్యక్షుడిగా సతీష్ ఎన్నిక కాగా ఉపాధ్యక్షుడిగా షేరి యాదగిరి, కార్యదర్శిగా ముత్యాల నితిన్ రాజ్, సహాయ కార్యదర్శిగా చెన్నోజు వీరాచారి,
తౌటం రవికాంత్, సహాయ కోశాధికారి వర్కాల రాజేందర్, సలహాదారులుగా గోషామహాల్రాకేష్, జిగ్ని ఉదయ్, కమిటీ సభ్యులుగా ఎం.డి. అబీద్, అర్ర ఉపేందర్, పవన్ దేవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ మేరకు నూతన అధ్యక్షుడు ఎరుకల సతీష్ మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిటీ సభ్యులు, కాలనీ వాసులతో కలసి అభివృద్దికి కోసం ఐక్యతతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






