14 July, 2026 | 4:13 AM

అనురాగ్‌లో క్వాంటం టెక్నాలజీస్‌పై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం

14-07-2026 01:44 AM

ఘట్‌కేసర్, జూలై 13 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం సమాచార సాంకేతిక వి భాగం ఆధ్వర్యంలో మోడరన్ ట్రెండ్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్ అండ్ క్వాంటం టెక్నాలజీస్ అనే అంశంపై ఐదు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం  నిర్వహించబడింది. క్వాంటం కం ప్యూటింగ్, క్వాంటం సాంకేతికతలలో జరుగుతున్న తాజా పరిణామాలు, పరిశోధనా ధోరణులు, ప్రాయోగిక అనువర్తనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అని తెలిపారు.

ఈ ఎఫ్డీపీకి వివిధ విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉ త్సాహంగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో క్వాంటం కంప్యూటింగ్ మౌలికాంశాలు, క్వాంటం అ ల్గోరిథమ్స్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం క్రిప్టోగ్రఫీ, పోస్ట్-క్వాంటం భద్రత మరియు క్వాం టం సాంకేతికతల ఆధునిక అనువర్తనాలపై విస్తృతంగా చర్చించారు.

వనరుల వ్యక్తులు అందించిన ఉపన్యాసాలు, చర్చలు మరియు పరస్పర సంభాషణలు పాల్గొన్న వారికి విశేషంగా ఉ పయోగపడ్డాయి.  ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి నితీషాశర్మ మార్గదర్శకత్వం, ఆర్గనైజర్ శేఖర్ రెడ్డి సమన్వయం, కన్వీనర్ డాక్టర్  జి.ఎల్. ఆనంద్ బాబు కృషి విశేషంగా నిలిచాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలోని అధ్యాపక బృందం, సిబ్బంది అందించిన సహకారం కార్యక్రమ విజయానికి దోహదపడింది.