29 August, 2026 | 8:13 PM

ఘనంగా క్రీడా దినోత్సవం

29-08-2026 07:00 PM

కాళేశ్వరం,(విజయక్రాంతి): పీఎంసీ జెడ్పీహెచ్ఎస్ కాళేశ్వరం పాఠశాలలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యానంద్ జయంతిని పురస్కరించుకుని క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొనికాల రాజేందర్  బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మయ్యని ఉపాధ్యాయ బృందం సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయశ్రీ మేడం, శిరీష మేడం, రాజ్కుమార్ సార్, సి ఆర్ పి లు బాణయ్య, సతీష్  తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో క్రీడా దినోత్సవం విజయవంతంగా ముగిసింది.