29 August, 2026 | 8:42 PM

Breaking News

సవరణ ఉంటే సరి చేసుకోండి   •   మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •  

సన్న వడ్ల బోనస్‌ కు సెప్టెంబర్ 10 ఆఖరు

29-08-2026 07:07 PM

సుల్తానాబాద్ వ్యవసాయ అధికారి పైడితల్లి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి​): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సన్న రకం వడ్ల బోనస్ పొందేందుకు రైతులు విత్తన కొనుగోలు పత్రాలను స్థానిక ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని, అధికారిక డీలర్లు లేదా సొంత సీడ్ ప్లాంట్ల రశీదులను సెప్టెంబర్ 10 లోపు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి శనివారం తెలిపారు.

వానాకాలం పండించిన పంట ప్రభుత్వ విక్రయా కేంద్రంలో విక్రయించుటకు గ్రామ వాలంటీర్ ద్వారా పంట నమోదు ప్రక్రియ తప్పనిసరి. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం దక్కేలా అధికారులుపనిచేస్తున్నారు అని, నిబంధనల ప్రకారం గడువులోగా వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు.

వాలంటీర్ ద్వారా పంట నమోదు తప్పనిసరి

​పంట దిగుబడిని అధికారిక కొనుగోలు కేంద్రాలలో విక్రయించడానికి గ్రామ వాలంటీర్ ద్వారా క్షేత్రస్థాయి పంట నమోదు చేయించుకోవడం తప్పనిసరి. సాగు విస్తీర్ణం, రకం వివరాలను కచ్చితంగా నమోదు చేసినప్పుడే ధాన్యం విక్రయాల సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తవని ఏవో స్పష్టం చేశారు.