29 August, 2026 | 9:03 PM

సింగరేణి వార్షిక క్రీడా పోటీలకు ఏర్పాట్లు

29-08-2026 07:02 PM

- శ్రీరాంపూర్ ఏరియాలో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం

- జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే శ్రీరాంపూర్ ఏరియా ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడా పోటీలు సెప్టెంబర్ 4 నుంచి ప్రగతి స్టేడియంలో ప్రారంభం కానున్నాయని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వార్షిక క్రీడా పోటీలు సెప్టెంబర్ 4న వాలీబాల్, సెప్టెంబర్ 5న బాస్కెట్ బాల్, 6న షటిల్ బ్యాడ్మింటన్ (మెన్& ఉమెన్) , టేబుల్ టెన్నిస్ (మెన్& ఉమెన్) , చెస్, క్యారమ్స్, 7న బాల్ బ్యాడ్మింటన్, 8న ఫుట్ బాల్, 9న హాకీ, 10న లాన్ టెన్నిస్, 11న కబడ్డీ, 12,. 13 తేదీలలో క్రికెట్, 15న అథ్లెటిక్స్(మెన్ & ఉమెన్), త్రోబాల్ (ఉమెన్), స్విమ్మింగ్(మెన్), 20న  కల్చరల్ ఈవెంట్స్ (మెన్ & ఉమెన్), 27న పవర్ లిఫ్టింగ్(మెన్&ఉమెన్), బాడీ బిల్డింగ్(మెన్) పోటీలు జరగనున్నాయన్నారు.

ఏరియాలోని అన్ని విభాగాల్లో 4 జట్లుగా పోటీలు

శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లు కలిపి మొత్తం నాలుగు జట్లుగా పోటీలలో ఉంటాయని జీఎం మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. SRP-1 & SRP-3 టీమ్ 1,RK-5, IK-1 & IK-OC టీమ్ 2,RK-7 & RKNT టీమ్ 3, SRP OC / ఇతర డిపార్ట్మెంట్లు & STPP టీమ్ 4 లో ఉండనున్నాయన్నారు. ప్రగతి స్టేడియం, శాంతి స్టేడియం, SCOA క్లబ్, CCC, సేవా భవన్, నస్పూర్ వేదికల్లో పోటీలు నిర్వహించబడునని, శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్ల క్రీడల్లో ప్రావీణ్యం కల ఉద్యోగిణి, ఉద్యోగులు గ్రూప్లుగా ఏర్పడి పోటీలలో పాల్గొని 2026-27 వార్షిక క్రీడలను విజయవంతం చేయాలని కోరారు.