29 August, 2026 | 9:02 PM

ఎంసీఏ ప్రోగ్రామ్‌లో స్పాట్ అడ్మిషన్లు

29-08-2026 06:57 PM

ముకరంపుర,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్ మార్గదర్శకాల ప్రకారం, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ వారు 2026-27 విద్యా సంవత్సరానికి గాను MCA ప్రోగ్రాంలో ప్రవేశం కోసం సెప్టెంబర్ 2 న స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు.

MCAలో ప్రవేశం పొందని అభ్యర్థులు TGICET-2026లో అర్హత సాధించినవారు, సాధించనివారు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు అవసరమైన ఫీజుతో కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగే స్పాట్ అడ్మిషన్‌కు హాజరు కావచ్చు. తుది ఖాళీల వివరాలు మరియు మార్గదర్శకాలు TGCHE వెబ్‌సైట్‌లో (https://tgicet.nic.in) ఉంచబడ్డాయి. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శించబడ్డాయి.