లక్ష్మీదేవునిపల్లి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు
29-08-2026 07:10 PM
బిక్కనూర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ జిల్లెల్ల లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ కెంపుల రమేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.






