డి మార్ట్ అక్రమ నిర్మాణంపై లోకాయుక్త ఫిర్యాదు
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ సోఫినగర్ సర్వే నెం. 256 ప్రభుత్వ భూమిలో డి-మార్ట్ అక్రమ నిర్మాణంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో నివేదిక పంపించాలని కోరినట్టు సమాచార హక్కు పరీక్షలు కమిటీ అధ్యక్షులు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హైదర్ తెలిపారు. నిర్మల్ పట్టణంలో డి మార్ట్ నిర్మించిన ప్రాంతంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించడం జరిగిందన్నారు.
దీనిపై పూర్తి వివరాలు తెలుసుకున్న లోకాయుక్త సమగ్ర నివేదికను వెంటనే అందించాలని బాధ్యులను వారిపై తీసుకోవాలని లోకయుక్త ఆదేశించినట్టు ఆయన వివరించారు. పట్టణ పరిధిలోని సోఫినగర్, సర్వే నంబర్ 256 లో ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో డి-మార్ట్ (D-Mart) వాణిజ్య భవనాన్ని అక్రమంగా నిర్మించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ సంచలన ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర గౌరవ లోకాయుక్త (హైదరాబాద్) స్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. ప్రభుత్వ భూమి పరీక్షకు తాను కృషి చేస్తున్నారని వివరించారు.






