31 August, 2026 | 4:32 AM

జపాన్ విద్యా పర్యటనకు పెబ్బేరు ఉపాధ్యాయుడు ఎంపిక

31-08-2026 02:14 AM

పెబ్బేరు, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం యాపర్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న పి. మురళీకృష్ణ ఎంపికయ్యారు. వనపర్తి జిల్లా నుంచి ఈ పర్యటనకు ఏకైక ఉపాధ్యాయుడిగా ఆయన ఎంపిక కావడం విశేషం.

సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జరిగే ఈ పర్యటనలో జపాన్లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, పాఠశాలల నిర్వహణ, సైన్స్, రోబోటిక్స్, సాంకేతిక విద్య తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. మురళీకృష్ణ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, యాపర్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.