31 August, 2026 | 5:40 AM

బీజేపీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

31-08-2026 02:15 AM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 30(విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలము నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు రాజుమోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మండ్లు, మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి బాలయ్య, దేవిసింగ్ లు, మాజీ సర్పంచులు గోపాల్ గౌడ్,సర్పంచ్ భాస్కర్లు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాగిరెడ్డిపేట్ మండల బిజెపి నూతన కార్యాలయం ద్వారా పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రజలకు మరియు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం,ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పైడి ఎల్లారెడ్డి  పిలుపునిచ్చారు.

అనంతరం సర్ పై సమావేశం నిర్వహించి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు పత్రాలను అందించే విధంగా బిఎల్‌ఏ 2లు గ్రామాలలో చూసుకోవాలని జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు  తెలియజేశారు.

అనంతరం గోపాల్ పెట్లోని బూత్ అధ్యక్షుడు రాములు  ఇంట్లో కార్యకర్తలతో కలిసి పైడి ఎల్లారెడ్డి, నీలం చిన్నరాజులు నరేంద్రమోడీ మన్కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నరేందర్ రెడ్డి, శ్రీకాంత్, రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి, కిషన్, రాజగంగదర్, గోపాల్, అంజయ్య, ఈశ్వర్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.