8 May, 2026 | 12:41 PM

ఆన్లైన్ ద్వారా జనగణన చేసుకోండి

08-05-2026 12:00 PM

ఫరూక్ నగర్ తాహసీల్దార్ నాగయ్య 

లింగారెడ్డిగూడెం గ్రామంలో మారథాన్ నడక

షాద్‌నగర్ మే8 (విజయక్రాంతి): సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా స్వీయ జనగణన చేసుకునేందుకు ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పించిందని షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ ఎమ్మార్వో నాగయ్య అన్నారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో స్వీయ జనగణన పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మార్ దాన్ వాక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ జన గణ ఆన్లైన్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈనెల పదవ తేదీ లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని వివరించారు.

ఈనెల 13వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి జనగణన కోసం కేటాయించిన సిబ్బంది వస్తారని, ప్రజల స్వచ్ఛందంగా తమ వివరాలను అందించి సహకరించాలని సూచించారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్, వార్డు సభ్యులు, కొనేంటి సాయికుమార్, గ్రామస్తులు నరేందర్ రెడ్డి, జంగయ్య యాదవ్, ప్రతాపరెడ్డి, దాదేమియా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..