1 September, 2026 | 10:16 PM

Breaking News

ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •   భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •  

వ్యవసాయదారులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి

15-05-2026 | 01:57am

తూప్రాన్, మే 14: రైతులు వ్యవసాయం ద్వారా తమ పండిస్తున్న పంటల సేద్యంలో రసాయనిక ఎరువుల వాడకానీ వ్యవసాయ క్షేత్రంలో తగ్గించాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ రైతులకు అవగాహన కల్పించారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామాన్ని సందర్శించి వారు రైతులతో సూచించారు.

భూమి బలిష్టంగా ఉండడం కోసం, యూరియా వాడకం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ముఖ్యంగా వరి పంటయే కాక వరితో పాటు ఇతర పంటలను పండించాలని వారు తెలిపారు. పంట మార్పిడి వలన భూమిలో సేంద్రీయ పదార్థాలు మెరుగు పడతాయని తద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని వివరించారు. ఇందులో గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి, ఎం ఏ ఓ గంగుమల్లు, ఏ ఈ ఓ హరీష్, యావపూర్ రైతులు పాల్గొన్నారు.