రైతులు సహజ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
17-03-2026 07:55 PM
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు
దుమ్ముగూడెం/భద్రాచలం,(విజయక్రాంతి): దుమ్ముగూడెం మండలం పర్ణశాల రైతు వేదికలో మంగళవారం సహజ వ్యవసాయంపై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సహజ వ్యవసాయం పద్ధతులు, ప్రయోజనాలు, ఖర్చు తగ్గింపు, నేల ఆరోగ్యం పరిరక్షణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న రైతులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. రైతులు సహజ వ్యవసాయాన్ని స్వీకరించి స్థిరమైన వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.




