14 July, 2026 | 4:17 PM

Breaking News

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •  

రైతు ఉత్సవాలలో పాల్గొన్న మొద్దులగూడెం రైతులు

23-03-2026 12:19 AM

దమ్మపేట, మార్చి 22 (విజయక్రాంతి): దమ్మపేట మండలం, మొద్దులగూడెం గ్రామానికి చెందిన రైతులు రైతు ఉత్సవాలలో భాగంగా గండుగులపల్లి రైతు వేదికలో  ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు  మోరంపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులను రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పనిచేస్తున్నారని ఇందులో భాగంగానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్  లో రైతుసంక్షేమానికి 23 వేల కోట్ల రూపాయలు కేటాయించడం  హర్షించదగ్గ విషయం అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగు తోనే రైతుల జీవితాలు బాగుపడతాయని, వీలైనంతవరకు ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయటానికి ప్రయత్నం చేయాలని, వీలైనంత త్వరగా  ఆయిల్ ఫామ్ రిఫైనరీ ని అప్పారావుపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఇ ఓ వినోద్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొంతు హిమబిందు, గణపా రాము, కర్లపూడి బాలు , బొంతు రాజశేఖర్ తదితర రైతులు పాల్గొన్నారు.