14 July, 2026 | 3:30 PM

Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •  

ఆగిపోయిన చింతమడక అభివృద్ధి

23-03-2026 12:18 AM

పూర్తికాని మిషన్ భగీరథ పనులు, అస్తవ్యస్తంగా రోడ్లు

అధ్వానంగా గ్రామంలోని మురికి కాలువలు

అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని గ్రామస్థుల వేడుకుంటున్నారు

సిద్దిపేట రూరల్, మార్చి 22: మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింత మడక లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 2019 లో మాజీ సీఎం కేసీఆర్ చింతమడక గ్రామానికి వచ్చి ఇంటి ఇంటి సర్వే నిర్వహించి, ప్రతీ కుటుంబానికి 10 లక్షల రూపాయలతో పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చారు.

కాగా రెండున్నర ఏండ్ల క్రితం ప్రభుత్వం మారడంతో అప్పటి నుండి గ్రామంలో అబివృద్ది పనులు ఎక్కడిక్కక్కడ ఆగిపోయాయి. గ్రామంలో మిషన్ భగీరథ పనులు నెమ్మదిగా చేపట్టడం తో రోడ్లు నిర్మాణం ఆగిపోయి, మట్టి రోడ్ల తో జనం ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలు సైతం అస్తవ్యస్తంగా మారడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.