బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి
14-07-2026 04:04 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో నాగన్ పల్లి కి చెందిన విద్యార్థి తెనుగు అఖిల తండ్రి గంగారామ్ తన పదో తరగతి (టెన్త్) ఒరిజినల్ మెమోలను పొరపాటున పోగొట్టుకుంది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అవసరమైన ఈ ముఖ్యమైన ధ్రువపత్రాలు కనిపించకపోవడంతో విద్యార్థి ఆందోళన చెందుతుంది. ఈ మెమోలు ఎవరికైనా లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలనీ లేదా సంబంధిత విద్యార్థిని సంప్రదించి అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రజలు సహకరించి విద్యార్థికి విలువైన ధ్రువపత్రాలు తిరిగి అందేలా సహాయం చేయాలని కోరుతున్నారు.






