తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం
సర్ ప్రక్రియపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి
సీఈవో సుదర్శన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణలో SIR(Special Intensive Revision) గడువు పొడిగింపుపై మంగళవారం నాడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి( Chief Electoral Officer) సుదర్శన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ రాజేష్ తదితర నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి తెలంగాణలో SIR గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు
. సర్ ప్రక్రియపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పొన్నం(Ponnam Prabhakar) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని సీఈఓను కోరామని వెల్లడించారు. బీఎల్ వోలు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని ఫిర్యాదు వస్తున్నాయని వివరించారు. అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించామన్నారు. ప్రభుత్వం, ప్రజలు ఈసీ భాగస్వామ్యం ఉంటేనే.. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.






