19 June, 2026 | 3:53 PM

Breaking News

ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన

19-06-2026 02:33 PM

తక్కువ నీటి పంటల సాగుతోనే మేలు: ఏఓ గీత

నంగునూరు,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున,రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి వి.గీత సూచించారు. శుక్రవారం అక్కెనపల్లి గ్రామంలో రైతులకు ఎల్ నినో ప్రభావం-ముందస్తు జాగ్రత్తల అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నందున రైతులు పంటల మార్పిడి (వైవిధ్యీకరణ) పాటించాలన్నారు.రైతులు ఆయిల్ పామ్ సాగుపై  దృష్టి పెట్టాలని కోరుతూ..వ్యవసాయ శాఖ రూపొందించిన అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.