19 June, 2026 | 5:09 PM

Breaking News

పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి   •   కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •   అన్న-అక్క మెంటార్‌షిప్ శిబిరం   •   చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

ఎల్లారెడ్డిపేట మండలంలో కల్తీ ఆహార విక్రయాలపై ఆందోళన

19-06-2026 03:39 PM

ఎల్లారెడ్డి పేట,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, మసాలా దినుసులు, నూనెలు, స్వీట్లు తదితర ఆహార పదార్థాలలో నాణ్యత లోపాలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత అధికారులు మండలంలోని దుకాణాలు, హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నాణ్యత లేని మరియు కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, గడువు తేదీలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. మండలంలో కల్తీ ఆహార విక్రయాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.