ఉట్నూర్ లో రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ గారి 56వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పార్లమెంట్ లో అహర్నిశలు దేశ ప్రజల పక్షాన కొట్లాడుతున్న తీరు మనం రోజు మీడియాలో పత్రికల్లో చూస్తున్నాం.
ఆయన పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ గారికి భగవంతుడు మనో ధైర్యాన్ని కల్పించాలని అన్నారు. దేశ రక్షణకు,ప్రజల సమస్యల పై ఆయనకు అండగా పార్టీ కార్యకర్తలు నాయకులు నిలవాలన్నారు. రాహుల్ గాంధీకి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన,ఖానాపూర్ నియోజకవర్గం నాయకులు,ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా నాయకులు,ఉట్నూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్ మండలంలో ని పులిమడుగు గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ రాథోడ్ రాంజీ, మరియు ఆడే ప్రకాష్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు వారి ఇంటికి చేరుకొని రెండు కుటుంబాలను ఎమ్మెల్యే గారు పరామర్శించారు.అండగా ఉంటామని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,ఉట్నూర్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.






