19 June, 2026 | 4:16 PM

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి

19-06-2026 02:55 PM

– జిల్లా సంక్షేమ అధికారి స్వరూప రాణి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఈ నెల  26న  జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ జిల్లా సంక్షేమ అధికారి  స్వరూప రాణి ప్రకటన లో తెలిపారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అవగాహన సభలు, మాదకద్రవాల వ్యతిరేక భారీ ఈ-ప్రతిజ్ఞ, పాఠశాలలు, కళాశాలల్లో పోస్టర్, నినాద రచన, వ్యాసరచన పోటీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ,ప్రజలు పాల్గొననున్నారని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు.జిల్లాలోని ప్రతి పౌరుడు జాతీయ మాదకద్రవ్యాల నిరోధక ఈ-ప్రతిజ్ఞ  చేయాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రతిజ్ఞ చేయవచ్చని తెలిపారు.