దమ్మపేటలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
దమ్మపేట,(విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ బొమ్మ వద్ద దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాహుల్ గాంధీ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాబోయే కాలంలో కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ పడుతున్న తపన ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు.






