రైతు రుణమాఫీ, రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలి
తహసిల్దార్ కు మెమోరాండం ఇచ్చిన భాజపా నాయకులు
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలని భాజపా మండల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భాజపా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రజా సమస్యలపై మండల పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు మెమోరాండం అందించారు.
పార్టీ మండల అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ.. కేంద్రం నుండి యూరియా విరివిగా వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా కృత్రిమ కొరత సృష్టించడం జరిగిందని, దాన్ని బీజెపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, దాని ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు.
పెండింగ్ లో ఉన్న అన్ని రకాల వితంతు, వృద్ధాప్య, వికలాంగ వివిధ రకాల పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శంకరయ్య, చంద్రయ్య, లక్ష్మణ్, బొక్కల బాగేష్, కోళ్ల మల్లేశం, మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌస్, ఓబీసీ మోర్చా వడ్లభాగేష్, మండల నాయకులు సంతోష్ గౌడ్, మల్లేశం, దుర్గయ్య, పెంటయ్య, నర్సింలు, బాబు తదితరులు పాల్గొన్నారు.




