16 March, 2026 | 5:17 PM

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ తొలగించొద్దు

16-03-2026 03:48 PM

కలెక్టరేట్ లో కొత్తూరు మండల ఉపసర్పంచ్ ల వినతిపత్రం

కొత్తూర్,(విజయక్రాంతి): ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను తొలగించొద్దని కొత్తూరు మండల ఉపసర్పంచ్ లు సోమవారం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొంతమంది సర్పంచులు ఉపసర్పంచుల చెక్ పవర్ తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని మీడియాలో వచ్చిందని అన్నారు. అయితే ఈ ప్రతిపాదనను ఉపసర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రక్రియ ఏదైనా ఉంటే ఉపసంహరించుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కొత్తూరు మండలం మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు శంతన్ రెడ్డి,మీసాల ఆరోగ్యం,హనుమంతు నాయక్,శంకర్ నాయక్,వెంకటమ్మ కుమారుడు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.