16 March, 2026 | 5:16 PM

వ్యక్తి అదృశ్యం

16-03-2026 03:38 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డి పెట్ గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్ వయసు 30, అనే వ్యక్తి హైదరాబాద్ నందు రాపిడో డ్రైవర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. అతని బంధువుల పెళ్లి ఉండడంతో దుర్గేందర్ మరియు అతని బావమరిది ప్రసాదులు ఇద్దరు కలిసి శనివారం రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి కామారెడ్డికి వచ్చి కామారెడ్డి నుండి నిజం సాగర్ బస్సు ఎక్కి ఎల్లారెడ్డికి వస్తుండగా లింగంపేట్ కు వచ్చిన తర్వాత దుర్గేందర్ బావమరిది ప్రసాద్ అక్కడ దిగగా అట్టి బస్సులో దుర్గేందర్ ఎల్లారెడ్డికి బయలుదేరి వస్తున్నాను

అని తన కుటుంబ సభ్యులతో, అతని భార్యతో పలుమార్లు ఫోన్ మాట్లాడినాడు అని ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని, ఆ తర్వాత అతను ఎల్లారెడ్డికి రాలేదని అతని కోసం చుట్టుపక్కల గ్రామాలలో తెలిసిన వారి వద్ద వెతకగా ఇక్కడ అతని ఆచూకీ దొరకలేదు అని దుర్గేందర్ అన్న అయినా చిట్యాల పరంధాములు ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పై వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినచో అట్టి సమాచారాన్ని ఎల్లారెడ్డి పోలీసులకు తెలియజేయగలరనీ ఎల్లారెడ్డి స్టేషన్ హౌజ్ అధికారి తెలిపారు.