29 June, 2026 | 2:58 PM

Breaking News

SIR ప్రక్రియపై మంత్రి పొన్నం ఆరా

29-06-2026 01:45 PM

బూత్ లెవల్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడిన మంత్రి

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) పర్యటించారు. SIR(ఓటరు సవరణ ప్రక్రియ) ఓటరు సవరణ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో మాట్లాడిన ఆయన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. 2002- 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని అవగాహన కల్పించడం జరిగింది