28 May, 2026 | 2:55 AM

అప్పుల ఊబికి కుటుంబం బలి!

28-05-2026 01:46 AM
  1. భార్య, పిల్లలను బావిలో పడేసి, చివరికి తానూ ఉరేసుకున్న యజమాని
  2. వనపర్తి జిల్లాలో హృదయ విదారక ఘటన

వనపర్తి, మే 27 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా ఖిల్లా మండలం సలికెలాపూర్ శివారులోని ఓ మామిడి తోట నిన్నటివరకు అక్కడ పిల్లల నవ్వులు వినిపించేవి. కుటుంబం జీవ నం కోసం చెమటోడ్చిన ఆ తోట.. బుధవా రం ఉదయం మాత్రం నాలుగు ప్రాణాల మౌన కేకలకు సాక్ష్యంగా మారింది. అప్పుల బాధ ఓ కుటుంబాన్ని ఎంత దారుణ స్థితికి తీసుకెళ్తుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది. భార్య, బిడ్డను హతమార్చి బావిలో తోసి, కన్న కొడుకు కాళ్లు కట్టేసి బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఇంటి యజమాని.

ఈ ఘటన వనపర్తి జిల్లాలోని ఖిల్లాలోని బుధవారం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గం గుల నర్సిములు(40) ఆరు సంవత్సరాల క్రితం తన భార్య ఎల్లమ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీ శ్రీ (13)తో వచ్చి గణపురం మండలంలో మా మిడి తోటలను లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలు కారణాల వల్ల 60 నుంచి 70 లక్షలకు పైగా అ ప్పులు చేసినట్లు సమాచారం.

కొన్ని అప్పులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తు న్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్పుల బాధలు ఎక్కువ కావడంతో నరసింహులు భార్య, కూతురును తాము నివాసం ఉంటు న్న సలికెలాపూర్ తాము ఉంటున్న తోటలో భార్య, కూతురును హతమార్చి నీటి సంపు లో వేశాడు. బావమరిది వెంకటేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బావమరిది పోలీసులకు సమాచారం అందించాడు. ఱఱపోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.