రెయిన్‌బో స్కూల్‌లో అధిక ఫీజులు
స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
అమీన్‌పూర్, మార్చి 21: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్‌లో బుక్స్ పేరిట, వార్షికోత్సవం పేరి ట పెంచిన ఫీజులను నిరసిస్తూ వందల మం ది విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. ఏటా ట్యూ షన్ ఫీజులు పది శాతం పెంచడంతో పాటు నోట్ బుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఆన్వల్ డే అంటూ వేల రూపాయల ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఒకరి పుస్తకాలను ఒకరు వాడరాదంటూ మళ్లీ కొత్తవే కొనాలని పట్టుబట్టడంతో ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు ఖర్చవుతుందని, బంగారం ధరలకంటే ఎక్కువగా బుక్స్ ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వా రం రోజులుగా ఈ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం స్పందించకుండా తమ డిమాండ్లను నిరాకరిస్తుంద న్నారు. ఎక్స్ ట్రా యాక్టివిటీల పేరుతో డబ్బు లు దండుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫీజులను తగ్గించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పడంతో తమ పిల్లల టీసీలను ఇచ్చేయాలని తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు.




