ఫకీరాబాద్ రైల్వే గేటు మూసివేత పొడిగింపు
20-05-2026 01:12 AM
బోధన్, మే19 (విజయక్రాంతి): నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ లో ఉన్న 185 నంబర్ రైల్వే గేటును మరమ్మతుల కారణంగా ఈ నెల 22 వరకు మరో మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ దిగంబర్ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.






