12 August, 2026 | 12:33 PM

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి

12-08-2026 11:48 AM

వనపర్తి (విజయక్రాంతి) : విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ సూచించారు. బుధవారం వనపర్తి బండార్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులకు ఉచిత యూనిఫార్మ్‌లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, హాజరు, క్రమశిక్షణపై సూచనలు చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు