12 August, 2026 | 1:00 PM

పాఠశాలకు మంచినీటి క్యాన్ల వితరణ

12-08-2026 11:52 AM

గుండాల, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌళిక వసతులు కల్పించేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు.  మండల కేంద్రంలోని ఎం‌పీపీఎస్ పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం ఆ పాఠశాలకు విద్యార్థుల కోసం వాటర్ క్యాన్లను వితరణగా ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి ఎంతో కీలకమైనవని వాటి అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, ఉపాధ్యాయులు శరత్ బాబు, ప్రమీల, వెన్నెల, శకుంతల, పూర్వ విద్యార్థులు అబ్దుల్ ఖైసర్, గుండెబోయిన లక్ష్మీనారాయణ, వాంకుడోతు జగన్, సనప శ్రీనివాసరావు, మొక్క శంకర్, మొక్క సంతోష్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.