యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు
యూరియా కోసం రాస్తారోక్ నిర్వహించిన రైతులు
చేగుంట ఆగస్టు 12: యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు, వివరాలకు వెళితే చేగుంట మండలం(Chegunta Mandal) పోలంపల్లి గ్రామస్తులు చేగుంట - మెదక్ రహదారిపై(Chegunta - Medak Road) బుధవారం ఉదయం రైతులు గంటపాటు రాస్తారోకు నిర్వహించారు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు కొండి మల్లేశం మాట్లాడుతూ తమకు నెల రోజుల నుండి యూరియా దొరకడం లేదని, యాప్ లో బుక్ చేసుకుందామంటే అది ప్రారంభం కాగానే, ఐదు నిమిషాల లోపే స్టాక్స్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా అధికారులు స్పందించే యాప్ ని రద్దుచేసి సాధారణంగా యూరియా రైతులకు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






